కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి సత్యవతి రాథోడ్(satyavathi rathod) కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం అభ్యర్థులను ప్రకటించని స్థితిలో ఆయా పార్టీలు ఉన్నాయని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ కవిత(mp kavitha), ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ బిందు, మున్సిపల్ చైర్మన్ రాం మోహన్ రెడ్డిలతో పాటు మంత్రి సత్యవతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఒకేసారి 105మంది అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్(Brs) అని తెలిపారు. కాంగ్రెస్(congress) , బీజేపీ(bjp) లను ప్రజలను నమ్మవద్దని సూచించారు. ఆయా పార్టీలు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని సూచించారు. సీఎం కేసీఆర్(cm kcr) ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోతున్నాయన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే అని, సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలతో పాటు కొత్త పథకాలను చేర్చినట్లు తెలిపారు. ఇలాంటి పథకాలు ఏ పార్టీకి అమలు చేయడం సాధ్యం కాదన్నారు. రాష్టంలో 45లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి సత్యవతి తెలిపారు.