స్కూల్ బస్సు(School Bus) టైర్‌కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన హబ్సీగూడ(Habsiguda) రవీంద్రనగర్‌లో చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఇవాళ ఉదయం హబ్సీగూడ రవీంద్రనగర్‌లో తమ బాబుని జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా, పక్కనే అమ్మమ్మ చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి కిందికి జారి తెలియకుండానే బస్ టైర్ కిందకి పడిపోయింది. అమ్మమ్మ చూసే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది.
బస్సు ఆపాలని పిలిచేలోపే చిన్నారిపై బస్సు టైరు వెల్లింది పాప టైరు కింద ఉండటంతో బస్ డ్రైవర్ గమనించలేదు. బస్సును ముందుకు తీయడంతో చిన్నారి టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ వద్దకి విద్యార్ధి సంఘాలు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టం తరువాత చిన్నారి మృతదేహాన్ని కేరళ తీసుకవెళ్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తమ కళ్లముందు ఆడుకుంటున్న చిన్నారి కొద్ది సమయంలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.