Telugu News » Seetharamula Shobha Yatra: అక్కడ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. ఇక్కడ సీతారాముల శోభాయాత్ర..!

Seetharamula Shobha Yatra: అక్కడ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. ఇక్కడ సీతారాముల శోభాయాత్ర..!

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవ్వగా 12.29 గంటలకు ప్రధాని మోడీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భద్రాద్రి(Bhadradri)లో లక్ష్మణ సమేత సీతారాముల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.

by Mano
Seetharamula Shobha Yatra: Balaram's life is there.. Seetharamula Shobhayatra is here..!

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram Mandir) కలసాకారమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవ్వగా 12.29 గంటలకు ప్రధాని మోడీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భద్రాద్రి(Bhadradri)లో లక్ష్మణ సమేత సీతారాముల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.

Seetharamula Shobha Yatra: Balaram's life is there.. Seetharamula Shobhayatra is here..!

మామిడి తోరణాలు వివిధ రకాల పుష్పాలతో భద్రాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నిత్య కల్యాణ మండపం వద్ద బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. భద్రాచలంలోని ప్రధాన ఆలయం నుంచి బయలుదేరిన సీతారాములు బ్రిడ్జి సెంటర్ అంబేడ్కర్ సెంటర్ తాత గుడి సెంటర్ రాజు వీధుల గుండా శోభాయాత్ర సాగింది.

భద్రాద్రి ఆలయ ప్రాంగణం మొత్తం కాషాయ జెండాలు రామనామ భక్త సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. మరోవైపు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమీప గ్రామమైన మధిరలోని ఈ ఆలయం నిర్మించి వందేళ్ళకు పైబడింది.

అయోధ్య మందిర ప్రారంభ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. అయోధ్యలో జరిగే కార్యక్రమం భక్తులు వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేకంగా ఎస్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, అయోధ్యకు రాజకీయ, సినీ ప్రముఖులు చేరుకున్నారు. కోలాటాల సందడి, మంగళ వాద్యాలు, వేద మంత్రాలు రామరథంతో సీతారాముల శోభాయాత్ర భద్రాద్రి పురవీధుల్లో ఘనంగా జరుగుతోంది.

You may also like

Leave a Comment