Telugu News » Rajireddy : మావోయిస్టు నేత రాజిరెడ్డి మృతి!

Rajireddy : మావోయిస్టు నేత రాజిరెడ్డి మృతి!

రాజిరెడ్డిపై కోటి రూపాయల వరకు నజరానా ప్రకటించింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.

by admin
Senior Maoist Leader Rajireddy Passes Away

తొలితరం మావోయిస్టు నేతల్లో ఆయన ఒకరైన మల్లా రాజిరెడ్డి (Rajireddy) చనిపోయారు. ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి. సాయన్న, సంగ్రామ్‌, అలోక్‌, మీసాల సాయన్న, దేశ్‌ పాండే, సత్తెన్న వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ప్రాంతంలోని ఉసూర్ బ్లాక్ లో చనిపోయినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.

Senior Maoist Leader Rajireddy Passes Away

రాజిరెడ్డి మృతిని పోలీసులు కూడా ధృవీకరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈయన. ఈ క్రమంలోనే మృతి చెందారు. మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డిపై కోటి రూపాయల వరకు నజరానా ప్రకటించింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం. ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌ పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి.

మావోయిస్టు పార్టీలో చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇంఛార్జిగా కూడా పనిచేశారు.

You may also like

Leave a Comment