Telugu News » Shabbir Ali : ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. బీఆర్ఎస్ కూడా అంతే..!

Shabbir Ali : ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. బీఆర్ఎస్ కూడా అంతే..!

రాహుల్ గాంధీ, రేవంత్ చాలా రోజుల నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారని అన్నారు షబ్బీర్ అలీ. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అని.. కేటీఆర్ తో కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారని అంటేనే ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయిందని సెటైర్లు వేశారు.

by admin
shabbir ali fire on cm kcr

తెలంగాణ (Telangana) ఎన్నికల ఫలితాల కోసం పార్టీలన్నీ వెయిట్ చేస్తున్నాయి. అయితే.. ఎవరికి వారు గెలిచేది తామేనని.. ఇతర పార్టీలను తిట్టిపోస్తున్నారు నేతలు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) నిజామాబాద్ (Nizamabad) లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బాగా పనిచేసిన కాంగ్రెస్ (Congress) నాయకులు, కార్యకర్తలు, అన్ని మతాలు, కులాల సంఘాలు, ఎన్జీవో ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని చెప్పాయని సంతోషం వ్యక్తం చేశారు.

shabbir ali fire on cm kcr

రాహుల్ గాంధీ, రేవంత్ చాలా రోజుల నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారని అన్నారు షబ్బీర్ అలీ. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అని.. కేటీఆర్ తో కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారని అంటేనే ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయిందని సెటైర్లు వేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు ప్రజలు ఈసారి పట్టం కట్టినట్లు తెలుస్తోందని.. దొరల పాలన వద్దని భావించి ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్‌ కు ఓటేశారని చెప్పారు.

తనకు మెజారిటీ, మైనారిటీ అనే ఫీలింగ్ లేదన్నారు షబ్బీర్. మనమంతా ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ లో ఓడిపోతామన్న భయం ఉందన్నారు. అందుకే, కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటున్నారని మండిపడ్డారు. తాను బరిలోకి ఉన్న నిజామాబాద్ అర్బన్‌ లో కాంగ్రెస్‌ కు కనివినీ ఎరుగని రీతిలో మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గం కామారెడ్డి. కానీ, ఈసారి అక్కడి నుంచి కేసీఆర్ బరిలో దిగడంతో.. అనూహ్యంగా రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. దీంతో షబ్బీర్ అలీ కామారెడ్డికి బదులు.. నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేశారు.

You may also like

Leave a Comment