అయోధ్యలో జనవరి 22న ఘనంగా రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతోన్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఈ వేడుకకు హాజరుకావాలని ఇప్పటికే దేశంలోని పలువురు ప్రముఖులకు, రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ సహా 6 వేల మంది అతిథులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు సమాచారం.. ఈ క్రమంలో ఎన్‌సీపీ అధ్యక్షుడు (NCP President) శరద్ పవార్ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు..
అయోధ్య (Ayodhya) రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని శరద్ పవార్ తెలిపారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకొంటోందో లేదో చెప్పడం కష్టమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. ఎదైతేనేం.. రామ మందిరం నిర్మాణం జరగడం.. ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తోన్నట్టు శరద్ పవార్ తెలిపారు.. ఇందులో ఎంతోమంది సహకారం ఉందని అన్నారు.
మరోవైపు రామమందిరం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం జరుగుతోన్న విషయం తెలిసిందే.. చివరకు నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది.
కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీ, నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు అందాయి. మరోవైపు డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.