తెలంగాణలో రాజకీయ వేడి(political heat) కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థుల ప్రకటనపై రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం(BJP Central Election Committee meeting) నేడు ఏర్పాటు చేసింది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే(sherlingampalli mla) టికెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గజ్జల యోగానంద్ అప్పట్లో పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోయినా గట్టి పోటీని ఇచ్చారు. ఓటమిని చవిచూసినా అవేమీ లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలతో మమేకమై ‘మీ సమస్య.. నా పోరాటం’ అనే నినాదంతో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
యోగానంద్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన కరోనా సమయంలో అనేక సేవలు అందించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యోగానంద్‌కు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైతం కోరుతున్నారు. 60వేలకు పైగా ఓట్లు కలిగిన ఆర్యవైశ్యుల కోరికను పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గజ్జల యోగానంద్‌కు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం ఆయనకే మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తొలిజాబితాలో బీజేపీ 40 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు పూర్తి చేసింది. ఇందులో బీసీలు, మహిళలకు ప్రధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో యోగానంద్‌కు మరో అవకాశం కల్పిస్తే శేరిలింగంపల్లిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.