Telugu News » Kaleswaram : కాళేశ్వరం.. అసలు నిజాలు!

Kaleswaram : కాళేశ్వరం.. అసలు నిజాలు!

సోవియట్ యూనియన్ హయాంలోని కజకిస్తాన్ లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు. ఖర్చు ఎక్కువ.. ఉపయోగం తక్కువ అవడంతో దాన్ని నిలిపివేశారు. అప్పట్లోనే దీని గురించి హెచ్చరించినా.. అక్కడకు వెళ్లి సమీక్ష జరపమని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదనేది నిపుణుల మాట.

by admin
Shocking Facts on Kaleshwaram Project

– కాళేశ్వరం లాభమా? భారమా?
– మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుతో..
– రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ
– ప్రాజెక్టు నిర్మాణంపైనా అనుమానాలు
– అవినీతి వల్లే నాసిరకం పనులు అంటూ..
– విమర్శల వెల్లువ
– పాత విషయాలను గుర్తు చేస్తున్న నిపుణులు

కాళేశ్వరం (kaleswaram) ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (Medigadda) బ్యారేజ్ కుంగుబాటుతో కేసీఆర్ (KCR) సర్కార్ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్ అయింది. ఎన్నిక సమయం కావడంతో ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నంత సీన్ లేదనే విషయం తేలిపోయిందని విపక్ష నేతలు, నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత విషయాలన్నో తెరపైకి వస్తున్నాయి.

Shocking Facts on Kaleshwaram Project

లక్షా 20వేల కోట్ల ప్రాజెక్టు అంటే నిపుణులతో రివ్యూ చేయాలి. కానీ.. కేసీఆర్ అలాంటిదేం చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. చిన్న ఇల్లు కడితేనే అందర్నీ సంప్రదిస్తాం.. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతుంటే నిపుణులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి, దానికి తగిన ఫలితంపై నిజానిజాలను వివరిస్తున్నారు. రూ.50 వేలు ఖర్చు పెట్టి రూ.10 వేల ఫలితం పొందితే ఎలా ఉంటుందో కాళేశ్వరం తీరు అలాగే ఉందని అంటున్నారు.

సోవియట్ యూనియన్ హయాంలోని కజకిస్తాన్ లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు. ఖర్చు ఎక్కువ.. ఉపయోగం తక్కువ అవడంతో దాన్ని నిలిపివేశారు. అప్పట్లోనే దీని గురించి హెచ్చరించినా.. అక్కడకు వెళ్లి సమీక్ష జరపమని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదనేది నిపుణుల మాట. కాళేశ్వరంతో ఖర్చు ఎక్కువ.. ఉపయోగం తక్కువేనని చెబుతున్నారు. పైగా నాణ్యత లేని నిర్మాణాల కారణంగా అదనపు భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ మునక సమయంలోనూ కాళేశ్వరం లోపాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తో మరోసారి ఇది ఉత్పన్నం అయింది.

కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు విపక్ష నేతలు, నిపుణులు. ఫౌండేషన్ సరిగ్గా చేయలేదని.. అందులో లోపం ఉందని అంటున్నారు. దానివల్ల కొంత కాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూపోయి కుంగిందని చెబుతున్నారు. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. కానీ, కేసీఆర్ సర్కార్ అవి ఫాలో అవ్వలేదని అంటున్నారు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాదే అయినప్పటికీ ఇప్పటికీ బలంగా ఉందని.. కానీ, కాళేశ్వరం నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోందని విమర్శలు చేస్తున్నారు. సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది అన్నది తెలియాల్సి ఉంది. అసలు, మరమ్మతు సాధ్యపడుతుందా లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

You may also like

Leave a Comment