అమెరికా (America)లో గన్ కల్చర్‌కు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఆత్మరక్షణ కోసం పెట్టిన చట్టాన్ని కొందరు తమ స్వార్ధాల కోసం వాడుకుంటూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా యువత తెగ మిస్ యూజ్ చేస్తున్నారు. కాగా నిన్న చికాగోలో జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. ఒకే వ్యక్తి ఈ కాల్పులు జరపడం శోచనీయం..
అమెరికా అతి పెద్ద నగరాల్లో ఒకటైన చికాగో (Chicago)లో జోలియట్ ప్రాంతంలోని 2200 బ్లాక్ ఆఫ్ వెస్ట్ ఏకర్స్ రోడ్లో ఒక ఉన్మాది ఇద్దరి ఇళ్ళల్లోకి చొరబడి కాల్పలుకు తెగబడ్డాడు. ఈ దాడిలో రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి 23 ఏళ్ళ రోమియో నాన్స్ (Romeo Nance) అని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు, నిందితుడికి ఇంతకు ముందే పరిచయం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కాల్పులుల జరిపిన ఉన్మాది పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఆది, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. మరోవైపు మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన ఏడుగురిని సోమవారం హత్యచేసినట్లు నిర్ధారించారు.