కర్ణాటక సీఎం(Karnataka CM) సిద్దరామయ్య(Sidharamaiah)కు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. వాహనం పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సిద్దరామయ్య దగ్గరకు ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లి పూల దండ వేసి హల్‌చల్ చేశాడు.
ఇది చూసి సీఎంతో పాటు అక్కడున్న కార్యకర్తలు షాక్ అయ్యారు. బెంగళూరు(Bangalore)లోని విల్సన్ గార్డెన్(Wilson’s Garden) సమీపంలో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫున సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కిన వ్యక్తి కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సిద్ధరామయ్యకు, మంత్రి రామలింగారెడ్డికి, సౌమ్య రెడ్డికి పూల దండలు వేశాడు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి నడుము దగ్గర తుపాకీని సీఎం, నాయకులు ముందుగా గుర్తించలేదు. అతడు కిందికి దిగుతున్న క్రమంలో తుపాకీని చూసి అంతా కంగుతిన్నారు. అయితే తుపాకీ ధరించిన వ్యక్తిని రియాజ్ పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్సెడ్ గన్లను సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది.
అయితే ఎన్నికల సమయంలో సైతం తుపాకీ వెంటపట్టుకుని తిరిగేలా పోలీసుల నుంచి అనుమతి పొందాడు. కొన్నేళ్ల కిందట రియాజ్‌పై హత్యాయత్నం జరగడమే ఇందుకు కారణం. అతడికి లైసెన్స్ కూడా ఉందని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని బీజేపీ దుయ్యబట్టింది.
Riyaz carrying a gun while meeting Karnataka CM Siddaramaiah during Model code of conduct
Appeasement taken to next level by Congress@ECISVEEP @HMOIndia pic.twitter.com/prZSBX06na
— ℙ𝕣𝕒𝕜𝕒𝕤𝕙 𝔾𝕒𝕟𝕒𝕥𝕣𝕒 मोदी का परिवार (@JPG2311) April 9, 2024