మెదక్ (Medak) కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) విమర్శలు గుప్పించారు..
మాది మాటలు చెప్పే పార్టీ కాదు చేతల ప్రభుత్వమని మైనంపల్లి హన్మంతరావు కామెంట్స్ చేశారు. కొంగకాళ్ళ హరీష్ రావు కొండపాక మండలానికి మార్కెట్ కమిటీ ఇవ్వలేదని విమర్శించిన ఆయన.. మెదక్ ఎమ్మెల్యే కనిపిస్త లేడని అబద్ధాలు ఆడటం కాదన్నారు.. దళితబందు పేరిట దళితులకు మోసం చేసిన హరీష్ పెద్ద అబద్ధాలకొరన్నారు.. భారీ చేరికలతో కాంగ్రెస్ ఓవర్ లోడ్ అయిందని తెలిపారు. అలాగే మతాలను అడ్డుపెట్టుకొని బీజేపీ ఓట్లను అడుగుతుందని విమర్శించారు.
హరీష్ రావు ఇక నీ దుకాణం, మీ మామ దుకాణం బంద్ అయ్యే సమయం దగ్గరపడిందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తున్నారని ఎంపి అభ్యర్థి నీలం మధు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కి బహుమతిగా మెదక్ పార్లమెంట్ ఇద్దామని అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే యువతకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు..
ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డిని, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అనేది కేసీఆర్ (KCR)ని చూసి తెలుసుకోవాలని మంత్రి కొండా సురేఖ విమర్శించారు.. ప్రత్యేక తెలంగాణ రాక ముందు దళితుని సీఎం చేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ విలువల గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు.. ప్రాజెక్ట్ ల పేరు తో కమిషన్లు అయ్యా తీసుకొంటే.. లిక్కర్ దందా కవిత నడిపించిందని ఆరోపించారు..