Telugu News » Singareni Elections: ఎట్టకేలకు సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

Singareni Elections: ఎట్టకేలకు సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

సింగరేణి ఎన్నికల(Singareni Elections) ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈనెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు(High Court)వీలు కల్పించింది.

by Mano
Singareni Elections: Finally a green signal for Singareni elections.. High Court orders..!

సింగరేణి ఎన్నికలకు(Singareni Elections) మార్గం సుగమమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈనెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు(High Court)వీలు కల్పించింది.

Singareni Elections: Finally a green signal for Singareni elections.. High Court orders..!

ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను ఇవాళ విచారణ చేపట్టింది హైకోర్టు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా.. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ల క్రితమే నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూవస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు వేర్వేరు కారణాలతో ఎప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి.

ఈ క్రమంలో ఎన్నికలను కోర్టు జోక్యంతో అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. కార్మిక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగింది. నామినేషన్లు, ఉపసంహరణలు, మార్కులు కేటాయింపు తర్వాత కొన్ని కార్మిక సంఘాలు మళ్లీ సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల నిర్వహణ కారణంగా, గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని అభ్యర్థించారు.

ఈ నెల 17న దీనిపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్ కుమార్‌ ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలంటూ గుర్తింపు కార్మిక సంఘానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నేటికి(గురువారం) వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో డిసెంబర్‌ 27న జరగాల్సిన ఎన్నికలకు మార్గం సుగమమయింది.

You may also like

Leave a Comment