పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ(Comgress Party)కి నిరసన సెగ ఎదురైంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Mlc Jeevan reddy) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. స్థానిక ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఎక్కడికక్కడ నిలదీశారు.
సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని ఓటర్ల(Voters)ను ప్రసన్నం చేసుకునేందుకు ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..మహిళలు అడ్డుతగిలారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల(Six Guarentees)పై ప్రశ్నించారు.
ఆసరా పెన్షన్ ఇప్పటివరకు తమకు రాలేదని వృద్ధులు సైతం ఎమ్మెల్సీని నిలదీశారు. జనవరి నెలలో ఎగ్గొట్టిన ఫించన్ ఎప్పుడిస్తారని ప్రజలు ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి చెక్కులు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అడిగారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదని, అంతలోనే మళ్లీ వచ్చి ఓట్లు అడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులపై తిరగబడ్డ మహిళలు
నిజామాబాద్ – ఇందల్వాయి మండలం, గన్నారం గ్రామంలో తిరగబడ్డ మహిళా సంఘాలు మరియు ఇల్లు లేని వాళ్లు.
ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటి వరకు మాకు ఏమైనా చేసారా అంటూ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిలదీశారు. pic.twitter.com/2xjseCILLt
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2024
ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరని రైతులు సీరియస్ అయ్యారు. ఉపాధి హామీ ఎక్కడ? మీరు ఇప్పటివరకు మాకు ఏమైనా చేశారా? అంటూ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై ప్రశ్నల వర్షం గుప్పించారు.జీవన్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగలొద్దని స్థానిక ఎమ్మెల్యే వారించినా వారు ఎంతకూ శాంతించకపోవడంతో ఆయన మధ్యలోనే ప్రసంగాన్ని ముగించికుని వెళ్లిపోయారు.