Telugu News » Skill Development Case: చంద్రబాబుకి బెయిలా? జైలా?…అసలేం జరుగుతోంది…?

Skill Development Case: చంద్రబాబుకి బెయిలా? జైలా?…అసలేం జరుగుతోంది…?

కేబినెట్ తీర్మానం లేకుండా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ అనే అధికారుల ద్వారా బాబు ఈ కుట్రకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందుగా అచ్చం నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారు.

by Prasanna
skill development case 1

Skill Development Case: చంద్రబాబుకి బెయిలా? జైలా?…అసలేం జరుగుతోంది…?

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును CID పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారించగా… ఆదివారం ఉదయమే ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి వాదప్రతివాదనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాదనల మధ్యలో మూడు సార్లు బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటలకు వాదనలు మొదలవుతాయి.

skill development case 1

సీబీఐ ఏమంటోంది…?

చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ ను సీఐడీ కోర్టులో సమర్పిచింది. ఈ కేసులో ఉన్న నిందితులతో కలిసి చంద్రబాబు కుట్రకు సూత్రధారి అంటూ రిపోర్టులో సీఐడీ పేర్కొంది. ఈ స్కాంకు సంబంధించి టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా డిజైన్ టెక్, సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారని చెప్తూ… అక్కడి నుంచి మొదలైన ఈ స్కాం వివరాలను సీబీఐ రిమాండ్ రిపోర్టులో వివరించింది.

కేబినెట్ తీర్మానం లేకుండా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ అనే అధికారుల ద్వారా బాబు ఈ కుట్రకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందుగా అచ్చం నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రూ. 3,281 కోట్లతో సీమెన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం పేరుతో కొన్ని షెల్ కంపెనీలను సృష్టించి…ఆ అకౌంట్లు ద్వారా మళ్లీ ఆ రూ. 272 కోట్లు చంద్రబాబు తన అకౌంట్లకే వచ్చేట్లు చేసుకుని ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణతో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేశారు.

కోర్టులో చంద్రబాబు…

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని విజయవాడ ఏసీబీకోర్టులో ప్రవేశ పెట్టారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో ఆయనను ముద్దాయిగా చేర్చాలంటూ సీఐడీ మెమో దాఖలు చేసింది. న్యాయస్థానం ఆమోదించడంతో చంద్రబాబు నాయుడు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు సీఐడీ అధికారులు.

సుదీర్ఘంగా విచారణ..

నంద్యాల నుంచి అరెస్ట్ చేసిన చంద్రబాబును శనివారం సాయంత్రం 5 గంటలకే సిట్ కార్యాలయానికి సీఐడీ అధికారులు తీసుకుని వచ్చారు. ఏసీబీ కోర్టు జడ్జి కూడా రాత్రి 9గంటల వరకు కోర్టులో వేచి చూశారు. అయితే అనుకున్న సమయానికి చంద్రబాబుని కోర్టుకి తరలించకపోవడంతో చివరకు జడ్జి ఇంటికి వెళ్లిపోయారు.

సమయం గడుస్తున్నప్పటికీ కోర్టులో హాజరుపర్చకపోవడంతో, సీఐడీ అధికారుల తీరుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబు న్యాయవాదుల బృందం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రబాబు వయసుని దృష్టిలో పెట్టుకుని తక్షణమే కోర్టుకి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అయితే రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత మాత్రమే తాము జోక్యం చేసుకుంటామంటూ హౌస్ మోషన్ పిటీషన్ ని జడ్జి తిరస్కరించారు. దాంతో తెల్లవారే వరకు వేచి చూడాల్సి వచ్చింది.

ఇవాళ ఏం జరుగుతుంది?

ఇవాళ తెల్లవారుజామున 4గంటల సమయంలో చంద్రబాబుని సిట్ ఆఫీసు నుంచి బయటకు తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించి, తర్వాత కోర్టుకి కాకుండా మళ్లీ సిట్ ఆఫీసుకి తరలించారు.

పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటలలోగా కోర్టులో హాజరుపర్చాలనే నిబంధన మేరకు ఉదయం 5.40 గం.ల తర్వాత చంద్రబాబుని సిట్ ఆఫీసు నుంచి కోర్టుకి తరలించారు. కోర్టుకి తీసుకు వచ్చిన తర్వాత తొలుత జడ్జిరూమ్‌లో విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు.

కోర్టులో విచారణ చేయాలని చంద్రబాబు న్యాయవాదులు కోరగా జడ్జి ఆమోదించారు. దాంతో ఉదయం 6 గంటల తర్వాత కోర్టు హాలులో విచారణ మొదలైంది.

చంద్రబాబు తరపున వాదనలు…

చంద్రబాబు తరుపున సిద్ధార్థ లుథ్రా, సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి టీం వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని లుథ్రా వాదించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా అన్నారు. శుక్రవారం నాటి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణను కోర్టుకు సమర్పించాలని కోరారు.

ఈ కేసులో 409 సెక్షన్ కింద వాదనలు 49 సెక్షన్ పెట్టడం సబబు కాదని సిద్ధార్థ లుథ్రా వాదన చేశారు. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్షాలు చూపాలని, అది జరగలేదు కాబట్టి రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని వాదనకు అవకాశం కోరారు. దాంతో న్యాయమూర్తి తిరస్కరణ వాదనలను అనుమతించారు.

చంద్రబాబు వాదనలు

వాదనలు వినిపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో చంద్రబాబు స్వయంగా తనకు తాను వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో తనకు సంబంధం లేదని తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని చెప్పారు.

సీఐడీ వాదనేంటి…?

చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ తెలిపింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు అసలు కారకుడు చంద్రబాబేనని అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితుల్ని సీఐడీ అరెస్టు చేసిందని, ఈ 8 మందిపై ఉన్న అభియోగాలే చంద్రబాబుపైనా ఉన్నాయన్నారు. నిందితుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ కేసులో చంద్రబాబు ప్రజాధనానికి నష్టం కలిగిస్తూ తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆయన్ను రిమాండ్ కు ఇవ్వాలని కోరారు.

ఆరున్నర గంటలు విచారణ…మూడు సార్లు బ్రేక్…

ఏసీబీ కోర్టులో జరుగుతున్న వాదనల్లో మూడు సార్లు బ్రేక్ ఇచ్చారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఈ కేసులో తీవ్రమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి. దీంతో ముందు 15 నిముషాలే వాదనలు వింటానని చెప్పిన జడ్జి…చివరకు మూడు సార్లు బ్రేక్ తీసుకుని మరి వాదనలు వింటున్న స్థాయిలో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఆరున్నర గంటలు విచారణ సాగింది. మధ్యాహ్నం 1.30 కి మళ్లీ వాదనలు జరగనున్నాయి.

గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు

మరోవైపు విశాఖలో ఉన్న గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. శనివారం సాయంత్రం అపాయింట్ మెంట్ ఇచ్చారని, ఆ తర్వాత అది రద్దైయి, ఆదివారం ఉదయం 10 గంటలకు అపాయింట్ మెట్ ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పారు. కానీ అది కూడ జరగలేదు. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నాయకుడు అచ్చెంనాయుడు తమ గవర్నర్ అపాయింట్ మెంట్ రేపటికి అంటే సోమవారానికి మారిందని తెలిపారు.

You may also like

Leave a Comment