Telugu News » Sonia Gandhi: మోడీకి సోనియా గాంధీ లేఖ

Sonia Gandhi: మోడీకి సోనియా గాంధీ లేఖ

ఈ ప్రత్యేక సమావేశాలకు అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో ఆమె కోరారు.

by Prasanna

ప్రధాని మోడీ (PM Modi) కి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ (Sonia Ghandi) లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై స్పష్టత ఇవ్వాలని లేఖలో సోనియా ప్రధానిని డిమాండ్ చేశారు. దానితో పాటు ఇతర 9 అంశాలపై చర్చకు సోనియా లేఖలో డిమాండ్ చేశారు.

Sonia Gandhi

పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని సోనియా గాంధీ ఆ లేఖలో విమర్శించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో ఆమె కోరారు.

‘ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాలలో చర్చించబోయే విషయాలపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకోసం సమావేశాలకు పిలుపునిచ్చారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయండి’ అంటూ ప్రధాని మోడీని కోరారు.

కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 22వ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు పార్లమెంట్ కొత్త భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. అజెండాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.. ఈ సమావేశాలలో జమిలి ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్చే తీర్మానం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను ప్రకటించక పోవడంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా సోనియా గాంధీ కూడా ఈ అంశంపైనే లేఖ రాశారు. దీంతో పాటు ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో అదాని గ్రూప్, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ హింస వంటి మరో 9 అంశాలను చేర్చాలని సోనియా పేర్కొన్నారు.

You may also like

Leave a Comment