Telugu News » Sonia-Sharmila: తుమ్మల రాజీనామా, షర్మిల సోనియా భేటీలో ఏం జరగనుంది?

Sonia-Sharmila: తుమ్మల రాజీనామా, షర్మిల సోనియా భేటీలో ఏం జరగనుంది?

ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల ఈ రోజు సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తుమ్మల సైతం పాలేరు అసెంబ్లీ టికెట్ కోసం పట్టబుట్టినట్లు సమాచారం.

by Prasanna
sonia sharmila

ఇవాళ, రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈనేపథ్యంలో సోనియాతో షర్మిల ఇవాళ భేటీ అవుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఇంతకుముందు కూడా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి సోనియా, కాంగ్రెస్ పెద్దలతో షర్మిల సమావేశమయ్యారు. అయితే షర్మిల పెట్టిన ప్రపోజల్స్ కు కాంగ్రెస్ పెద్దలు అంగీకారం తెలిపారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వాటికి ఆమోదం లభించి ఉంటే.. ఇవాళ సోనియా, రాహుల్ సమక్షంలో షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

sonia sharmila

ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల ఈ రోజు సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తుమ్మల సైతం పాలేరు అసెంబ్లీ టికెట్ కోసం పట్టబుట్టినట్లు సమాచారం. అయితే తుమ్మలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే సమావేశమై, ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలకు పాలేరు సీటు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని సంబంధిత వర్గాలు చెప్తున్నాను.

ఇక ఏపీలోనూ షర్మిల సేవలను వినియోగించుకోవాలని తొలుత కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అయితే తాను ఏపీకి వెళ్లే ప్రసక్తే లేదని, తెలంగాణకే పరిమితం అవుతానని తేల్చి చెప్పినట్లు టాక్. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తుంది. అయితే, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన సైతం పాలేరు నియోకవర్గం నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గత నెలలో ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ఆర్‌టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి సోనియాతో షర్మిల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సోనియాగాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. అయితే, సాయంత్రం సమయంలో షర్మిల, సోనియా భేటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పాలేరు సీటు ఎవరికి ఇస్తుందో? షర్మిల, తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో వీరి ఎటువంటి షరతులు పెడతారో, వాటిని కాంగ్రెస్ అధిష్టానం ఏమంటుందో అనే రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

ఈరోజు షర్మిల, సోనియా భేటీ తరువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసే అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం అయితే.. ఆమె ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే అంశంకూడా ఆసక్తికరంగా మారింది.

 

 

 

 

You may also like

Leave a Comment