వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande bharath Express)లో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు యువతులు పాటలు పాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సదరన్ రైల్వే ట్విట్టర్ ( X )లో పోస్ట్ చేసింది.
‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో యువతులు తమ మధురమైన పాటలతో తమ ప్రయాణాన్ని ఆనందకరంగా మార్చుకునేందుకు సంగీతాన్ని ఎంపిక చేసుకున్నారు’ అంటూ దక్షిణ రైల్వే ఎక్స్(x) ఖాతాలో రాసుకొచ్చింది.
చెన్నె నుంచి మైసూరుకు ప్రయాణిస్తున్నప్పుడు సంగీత కచేరి చేస్తున్న దాదాపు 12 మంది యువతులను ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ వీడియోకు విభిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వాటి వల్ల ప్రయాణ సమయంలో చిరాకు తప్ప మరేమీ రాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ అధికారిక పేజీలో వీడియోను ప్రమోట్ చేసుకునేందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దంటూ దక్షిణ రైల్వేపై కూడా విమర్శలు గుప్పించారు. రైల్వే బోర్డు ప్రజల ఇబ్బందిని ఎందుకు ప్రోత్సహిస్తోందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
🚄🎶 A symphony of joy aboard the #Chennai – #Mysuru Vande Bharat Express! 💃✨
Witness the enchanting moments as these young ladies turn their journey into a delightful musical escapade with their sweet songs.#SouthernRailway #VandeBharat #VandeBharatExpress pic.twitter.com/BuiwzxZnz3
— Southern Railway (@GMSRailway) March 12, 2024