Telugu News » Puppalaguda Lands : సర్కారువారి సాక్షిగా.. వేల కోట్ల భూములకు రెక్కలు

Puppalaguda Lands : సర్కారువారి సాక్షిగా.. వేల కోట్ల భూములకు రెక్కలు

పుప్పాలగూడ.. కబ్జాల అడ్డా- పార్ట్ 2

by CDReddy

– పుప్పాలగూడ.. కబ్జాదారుల స్వర్గం
– దోచుకున్నోడికి దోచుకున్నంత..దర్జాగా కబ్జా
– తప్పుడు డాక్యుమెంట్లతో 30 ఏండ్ల క్రితమే పాగా
– తెలంగాణ వచ్చాక భారీగా రిజిస్ట్రేషన్స్
– తాజాగా హెచ్ఎండీఏ అనుమతులు
– లింకు డాక్యుమెంట్లలో బయటపడ్డ లోగుట్టు
– తప్పుడు అలాట్మెంట్స్ తో కోట్లకు పడగలు
– శ్రీ వెంకటేశ్వర హోటల్స్ అండ్ కన్వెన్షన్..
– మార్టిగేజ్ లో బండారం బట్టబయలు
– కనీసం లింకు కూడా చూడకుండానే అనుమతులు
– రిజిస్ట్రేషన్, మున్సిపాల్టీ శాఖల పనితీరుపై విమర్శలు

పుప్పాలగూడ.. కబ్జాల అడ్డా- పార్ట్ 2

క్రైంబ్యూరో, రాష్ట్ర: ముందుచూపు ఉన్నవాడు చంద్రమండలం పై కూడా భూములు కొన్నాడు. అచ్చం అలాగే పుప్పాలగూడ కాందిశీకుల భూములను ఖతం చేయటం వెనుక ఎన్నో కథలు నడిచాయి. తెలంగాణ వచ్చాక చకచకా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ గండిపేట ఎమ్మార్వో ఆఫీస్ అడ్డాగా.. గుంటల్లో భూమిని గంటల్లోనే గుటిక్కున మింగేస్తున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటున్నారు. హెచ్ఎండిఏ అనుమతుల్లో పెట్టిన డాక్యుమెంట్ల పై “రాష్ట్ర” క్రైం బ్యూరో ఇన్వేస్టిగేషన్ లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. సెటిల్మెంట్ కమిషన్ జారీ చేసిన వారు వేరు, భూములను అడ్డంగా దోచేస్తున్న వారి పేర్లు వేరుగా ఉన్నాయి. సనద్ ఇచ్చిన డాక్యుమెంట్ల రికార్డులు పరిశీలిస్తే ఎన్నో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 1964 నుంచి రికార్డులను చూస్తే.. లింకులు లేకుండానే రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కారు. తమవారే ఇరు పక్షాలుగా ఉండి.. కోర్టుల నుంచి తీర్పులు తెచ్చుకున్నారు. కొన్నింటిలో కోర్టులు మొట్టికాయలు వేశాయి. భూమి ఎవరిది.. మీరెవరంటూ ఓ.ఎస్. 32 ఆఫ్ 2005 కేసులో తీర్పునిచ్చారు. సింగ్స్ పేర్లు ఉంటే చాలు అంతా వారిదే అన్నట్లుగా వ్యవహరించారు. గతంలోని ఈసీలను పరిశీలిస్తే.. హైదరాబాద్ భూముల్లో తప్పుడు, నకిలీ పత్రాలు పెట్టి ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తారని ఈ కాందిశీకుల భూముల రికార్డులను తిరగేస్తే ఇట్టే తెలిసిపోతుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ కస్టోడియల్ లో ఉండాల్సిన భూములను ఎలా నకిలీ డాక్యుమెంట్లు పెట్టి మాయం చేశారో తెలిసిపోతోంది.

raashtra-special-story-on-kokapeta-puppalaguda-lands-scam part 2

వెంకటేశ్వర హోటల్స్ అండ్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు

పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 329 ప్రయివేట్ భూమి. 1990లోనే తప్పుడు పత్రాలు పెట్టి రికార్డులు ఏమార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డులు చూస్తే పట్టాలు ఉన్నవారికి… కబ్జా కాలంలో ఉన్నవారికి మధ్య అనేక పరిణామాలు జరిగాయి. సుదీర్ఘంగా రికార్డుల్లో ఉన్నవారిని కాదని లింకు డాక్యుమెంట్లతో రికార్డుల్లోకి ఎక్కినట్లు తెలుస్తుంది. అయితే వాటి మూలాలు ఇప్పటికి బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. 21 గజం భూమి లింకు డాక్యుమెంట్ అయినా 763/1968, 14-03-1968న రిజిస్ట్రేషన్ అయింది. ఉర్దులో ఉన్న ఆ లింకు డాక్యుమెంట్ తో నమ్మించి మోసాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. లింకు డాక్యుమెంట్స్ సరైనవా కాదా చూసుకోకుండానే రిజిస్ట్రేషన్స్ చేయడం, బగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో 2013లో రిజిస్ట్రేషన్ అయి ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా 5 ఎకరాల్లో హోటల్ , కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ వద్ద నుంచి అనుమతులు తీసుకున్నారు. మార్టిగేజ్ డాక్యుమెంట్లలో కూడా ఇదే 21 గజం లింకు చూపెడుతున్నారు. కాని ఆ లింకులో ఏముందో మాత్రం ఎవ్వరు పసిగట్టలేకపోవడం.. ప్రభుత్వ అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. ఈ రికార్డులు అప్పుడే బయటపడితే.. ఇది ప్రభుత్వ భూమిగా మారే అవకాశాలు ఉండేవని న్యాయనిపుణుల అభిప్రాయం. ఈ 763 లింకుతోనే సుమారు 200 ఎకరాల రికార్డులు మారాయని అరోపణలు ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రభుత్వ భూములుగా మారాల్సిన ఆ సర్వే నెంబర్స్.. ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అంటున్నారు. జీపీఏల రూపంలో అనేక విధాలుగా వివాదంలో చిక్కుకున్నాయి. అసలైన రైతులకు మాత్రం ఇప్పటికి న్యాయం జరగడం లేదు. దోచుకునే వారికి దోచుకున్నంతగా పరిస్థితి మారిపోయింది.

raashtra-special-story-on-kokapeta-puppalaguda-lands-scam part 2 3

ఈ భూముల లోగుట్టు అంతుపట్టడం కష్టమే సుమారు 800 ఎకరాల్లో ఏం జరిగిందో కానీ.. ప్రయివేట్ భూములు అంటూ జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ లలో ఎన్నో అవకతవకలు బయటపడుతున్నాయి. జీపీఏల పేర్లతో ఒక విధంగా, రాటిఫికేషన్ పేరుతో మరోలా నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.
ఇక.. 5 ఎకరాల భూమి పత్రాలతో 10 ఎకరాలు ఎలా మాయం చేశారో పార్ట్ 3 లో చూద్దాం.

raashtra-special-story-on-kokapeta-puppalaguda-lands-scam part 2 2

You may also like

Leave a Comment