Telugu News » Adipurush @ OTT : రెండు ప్రముఖ ఓటీటీల్లోకి “ఆదిపురుష్” ఆగమనం…!

Adipurush @ OTT : రెండు ప్రముఖ ఓటీటీల్లోకి “ఆదిపురుష్” ఆగమనం…!

ఈ తరంలో ఏ హీరోకి రాని అవకాశాలు..డార్లింగ్ ప్రభాస్ (Prabhas)కి వచ్చాయి. ఒకటి జానపద చిత్రం బాహుబలి(Bahubali) కాగా, మరో పౌరాణిక చిత్రమైన ఆదిపురుష్. అయితే..దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ట్రైలర్ దగ్గర నుంచే వివాదాలు, వెటకారాలు వెంటాడాయి.

by sai krishna

ఈ తరంలో ఏ హీరోకి రాని అవకాశాలు..డార్లింగ్ ప్రభాస్ (Prabhas)కి వచ్చాయి. ఇండియా వైడ్ రిలీజ్ అయిన జానపద చిత్రం బాహుబలి(Bahubali) కాగా, మరో పౌరాణిక చిత్రమైన ఆదిపురుష్. అయితే..దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ట్రైలర్ దగ్గర నుంచే వివాదాలు, వెటకారాలు వెంటాడాయి.

జూన్ 16న వివిధ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది,కానీ దరిర్శకుడి మీద ఒపీనియన్ ఏం మాత్రం చేంజ్ కాలేదు.దీంతో నిర్మాతలు భారీ గానే నష్టపోయారు.

కానీ ఆదిపురుష్ ఫెయిల్యూర్ ప్రభాస్ కెరీర్ కి ఏ మాత్రం ఎఫెక్ట్ కాలేదు. లాభ నష్టాల సంగతి ఎలా ఉన్నా థియేటర్లలో వెనుకపడ్డ “ఆదిపురుష్’’ ..ఇప్పుడు ఓటీటీ(OTT)కి వచ్చాడు.

చిత్రం బృందం నుంచి గానీ, ఓటీటీ సంస్థ నుంచి గానీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ‘ఆదిపురుష్’ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేశారు.ఈ సినిమా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు వీలుగా.. ‘ఆదిపురుష్’ మూవీ ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలు తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి.

వాటి ప్రకటనల ప్రకారం ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

రామాయణం(Ramayanam) ఆధారంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించగా.. హనుమంతుడి పాత్రను దేవదత్తనాగే పోషించాడు. ఇక లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు.

ఆది నుంచీ ‘ఆదిపురుష్’..ఏదో ఒక విషయంపై వార్తలకు వాయినంగా మారిపోయింది. రామాయణంలోని పాత్రలను వక్రీకరించారని, గ్రాఫిక్స్ సరిగా లేవని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వాటన్నింటినీ ఎదుర్కున్న మేకర్స్..అనంతరం గ్రాఫిక్స్ లో పలు మార్పులు చేశారు. ప్రేక్షకులకు మళ్లీ బూస్ట్ అప్ తీసుకొచ్చింది. రిలీజైన తర్వాత కూడా ఈ చిత్రం పలు విమర్శలు ఎదుర్కొంది.

డైలాగులపై విమర్శలు(Adipurush controversial dialogues) వచ్చాయి. దీంతో ఆ డైలాగులను తొలగించి ఎడిట్ వెర్షన్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అయినా ఆదిపురుష్ ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలోనైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

You may also like

Leave a Comment