దేశమంతా ఒక్కసారిగా పవర్ కట్(Power cut) అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. శ్రీలంక(Srilanka)లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అక్కడి ప్రజలను అంధకారంలో మునిగిపోయారు. ఆ దేశ ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. శనివారం సాయంత్రం 5.30 నుంచి దేశవ్యాప్తంగా ఒక్కసారి విద్యుత్ సేవలు నిలిచిపోయాయి.
శ్రీలంక ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకను విద్యుత్ సమస్య కూడా చుట్టు ముట్టింది. సాంకేతిక కారణాల వల్ల పవర్ కట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే విద్యుత్ నిలిచిపోవడంతో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య ఏర్పడడటంతో మొత్తం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ విషయంపై సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక ప్రకటన చేసింది. ఈ బోర్డు దేశంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వంటి వాటిని పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రోజులో దాదాపు 10 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలకు కూడా కొరత ఏర్పడింది. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాత్రి వేళ విద్యుత్ నిలిచిపోవడంతో అప్పటి నుంచి చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులకు ప్రతికూల పరిస్థితులున్నాయి.
అయితే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాట్‌మలే, బియగమా మధ్య మెయిన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లలో సమస్య ఏర్పడిందని.. దాంతో దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి శ్రీలంక 2022 నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.