Telugu News » Sruthihaasan: రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్న.. శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్!

Sruthihaasan: రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్న.. శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్!

రాజకీయాల్లోకి ఎంట్రీపై శృతిహాసన్ స్పష్టమైన సమాధానం చెబుతూనే వచ్చింది. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదువడంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది.

by Mano
Sruthihaasan: Question on entry into politics.. Sruthihaasan's strong counter!

విలక్షణ నటుడు కమలహాసన్(kamal hasan) కూతురిగా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది శృతిహాసన్(sruthi haasan). సౌత్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను సంపాదించుకున్న కొద్ది మంది హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల స్థాయిని దాటి పాన్ వరల్డ్‌(pan world) సినిమాలు చేస్తోంది.

Sruthihaasan: Question on entry into politics.. Sruthihaasan's strong counter!

హీరోయిన్‌గానే కాకుండా డైరెక్టర్‌గా, సింగర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టనట్లు చెప్పడం ఈ బ్యూటీకి అలవాటు.

శృతిహాసన్ తండ్రి, విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టడంతో ఆ పార్టీలోకి శృతి ఎంట్రీపై చాలా సందర్భాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ ఎంట్రీపై స్పష్టమైన సమాధానం చెబుతూనే వచ్చింది. తాజాగా కోయంబత్తూర్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్‌కు అదే ప్రశ్న ఎదువడంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది.

తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి లేదని పేర్కొంది. సినిమాల్లోనే నటిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రానని మరోసారి గట్టిగా చెప్పేసింది. తాను తమిళ అమ్మాయినని ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు.. త్వరలోనే ఓ ఆల్బమ్‌ను కూడా విడుదల చెయ్యనున్నట్లు తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న బ్యూటీ ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమాలో నటిస్తోంది.

You may also like

Leave a Comment