చైనా (China)లో ఇటీవల న్యుమోనియా (pneumonia) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి చిన్న పిల్లల్లో శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాఠశాలలు మూత పడే పరిస్థితి నెలకొంది. అటు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం అందించాలని చైనాను కోరింది.
చైనాలో ఆందోళనలో నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే తమ పౌరులు పలు సూచనలు చేశాయి. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరఖండ్ రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపాయాలను అలర్ట్ మోడ్ లోకి తీసుకు వచ్చాయి.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. కర్ణాటకలో సీజనల్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. సీజనల్ ఫ్లూ అనేది ఒక అంటు వ్యాధి. ఇది సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉంటుందని, వ్యాధి సోకిన వారిలో తక్కువ అనారోగ్యం, తక్కువ మరణాల రేటు ఉంటుంది.
కానీ ఇది శిశువులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి లేనివారికి ఈ వ్యాధి వల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వైద్యాధికారులు అలర్ట్ గా ఉండాలని తెలిపింది. మరోవైపు రాజస్థాన్ లోని అన్ని జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు ఒక సలహాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, అన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులను పర్యవేక్షించాలని కోరింది.