Telugu News » Subbalaxmi: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..!

Subbalaxmi: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..!

‘నా బలం, మా అమ్మమ్మను నేను కోల్పోయాను’ అంటూ సుబ్బలక్ష్మి మనుమరాలు ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. సుబ్బలక్ష్మి తెలుగు,తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా చిత్రాల్లో నటించారు.

by Mano
Subbalaxmi: Tragedy in the film industry.. Popular actress passed away..!

దక్షిణాది సినీ పరిశ్రమలో సీనియర్‌ నటి ఆర్‌.సుబ్బలక్ష్మి (87)(R.subbalaxmi) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనుమరాలు ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా తెలిపారు. సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Subbalaxmi: Tragedy in the film industry.. Popular actress passed away..!

‘నా బలం, మా అమ్మమ్మను నేను కోల్పోయాను’ అంటూ సుబ్బలక్ష్మి మనుమరాలు ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. సుబ్బలక్ష్మి తెలుగు,తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘కళ్యాణ రాముడు’ సినిమాలో కనిపించారు. నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఏ మాయ చేసావె’లో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

దాదాపు 75 సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి చివరిసారి కోలీవుడ్‌లో విజయ్ ‘బీస్ట్‌’ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నూ సుబ్బలక్ష్మి పనిచేశారు.

సినీ పరిశ్రమలోకి రాకముందు సుబ్బలక్ష్మి జవహర్‌ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951లో ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా సేవలందించారు. దక్షిణ భారత దేశం నుంచి ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు.

You may also like

Leave a Comment