Telugu News » Suicide : ప్రాణాలు రిస్క్ లో పడేసిన దళితబంధు.. ఇద్దరి పరిస్థితి విషమం..!

Suicide : ప్రాణాలు రిస్క్ లో పడేసిన దళితబంధు.. ఇద్దరి పరిస్థితి విషమం..!

దళితబంధుపై ఆశపెట్టుకొన్న వారు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో జనవరి 28న ఒకరు.. ఇవాళ మరోకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

by Venu

బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కొందరి ప్రాణాలకు సంకటంగా మారింది. ఇప్పటికే పలువివాదాలకు కేరాఫ్ గా మారిన ఆ పథకం ఇద్దరి ప్రాణాలకు హాని తలపెట్టింది. తాజాగా దళితబంధు వస్తుందో.. రాదోనని ఇద్దరు లబ్ధిదారులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఇందులో భారీగా అవినీతి చోటు చేసుకొందనే ఆరోపణలున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దళితబంధుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు..

అయితే దళితబంధుపై ఆశపెట్టుకొన్న వారు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో జనవరి 28న ఒకరు.. ఇవాళ మరోకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దళితబంధు మొదటి విడతలో వచ్చిన రూ. 5 లక్షలతో ఫొటో స్టూడియో ఏర్పాటు చేశారు.. వీణవంక మండలం కేంద్రానికి చెందిన గాజుల అమలదంపతులు..

మొదటగా మూడు లక్షలు అప్పుతెచ్చారు. రెండో విడుతలో వచ్చే దళితబంధు వస్తే అప్పు తీర్చేద్దామనుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో దళితబంధుపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో నేడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అమల అనే మహిళ.. మరోవైపు జనవరి 28న జమ్మికుంట (Jammikunta) మండల కేంద్రం, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏరియాలో, బొడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇతను కూడా మొదటి విడత దళితబంధులో వచ్చిన ఐదు లక్షలతో పాటు మరిన్ని డబ్బులు అప్పు తెచ్చి డీజె సౌండ్ సిస్టం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండో విడత దళితబంధు రాదని స్థానిక నేతలు చెప్పడంతో మనస్థాపానికి గురైన అతను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నడని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్వయంగా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment