Telugu News » Suicide : యువ వైద్యురాలి ప్రాణం బలిగొన్న కట్నపిశాచి..!!

Suicide : యువ వైద్యురాలి ప్రాణం బలిగొన్న కట్నపిశాచి..!!

కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అడ్వకేట్‌ సతీదేవి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధిక కట్నం డిమాండ్‌ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక విషయం సీరియస్ అవ్వడంతో.. యువతి మృతికి కారణం అయిన వైద్యుడిని తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

by Venu

భారతీయ సమాజానికి వరకట్న వ్యవస్థ వంటి సాంఘిక దురాచారాలు శాపంగా ఉన్నాయి.. ఒకప్పుడు వరకట్న దురాచారం సమాజంలో రాజ్యమేలింది. ఎందరో ఆడపడుచులు అత్తింట కట్న దాహానికి బలయ్యారు.. ఈ ఆధునిక కాలంలో యువతి యువకులు సంపాదన పరులుగా మారిన వరకట్న సమస్య రూపు మాయలేదు. చట్టాలు ఎంత కఠినంగా మారిన ఇక్కడ మాత్రం మార్పు రాలేదు.. నాటి నుంచి నేటికీ కట్న పిశాచి కబళిస్తూ ఉంది.

తాజాగా కట్నం అనే నిప్పు మరో అబల జీవితాన్ని బలి చేసింది. తిరువనంతపురం (Thiruvananthapuram) మెడికల్ కాలేజీలో (Medical College) సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా (26)కు తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా అబ్బాయి తరపున భారీ కట్నాన్ని డిమాండ్‌ చేశారు (Dowry Demand)

అయితే సహానా కుటుంబం అంత కట్నం ఇచ్చుకోలేమని చెప్పడంతో.. పెళ్లి సంబంధం క్యాన్సిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో బలవన్మరణానికి పాల్పడింది.. కాగా సహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. పీజీ వైద్యురాలి (PG Doctor) ఆత్మహత్య (Suicide)పై సరైన విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా.. మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు.

మరోవైపు కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అడ్వకేట్‌ సతీదేవి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధిక కట్నం డిమాండ్‌ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక విషయం సీరియస్ అవ్వడంతో.. యువతి మృతికి కారణం అయిన వైద్యుడిని తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

You may also like

Leave a Comment