తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికలకు కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. ఎన్నికలు సరిగ్గా జరిగేటట్టు చూస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసే షెడ్యూల్ కి అనుగుణంగా నవంబర్ 30వ తేదీన అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారికంగా ఎన్నికల తేదీలను వెల్లడించారు. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రారంభమై చివరికి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఇందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకి సిద్ధమయ్యాయి అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులని ప్రకటించి మేనిఫెస్టోకి పెద్ద పీట వేస్తూ శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీ పథకాలని ఆవిష్కరించింది. ఎన్నికలకి అభ్యర్థులని ప్రకటించడానికి పూర్తిగా రెడీ అవుతోంది. బిజెపి పార్టీ కూడా అభ్యర్థులని ఖరారు చేసే పనిలో పడింది. అభ్యర్థులని త్వరలోనే ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల దగ్గర పడే కొద్ది అనేక సంస్థలు ప్రజల దగ్గరికి వెళ్లి రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం ఎవరనేది అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కి సంబంధించి వారి ప్రాధాన్యతలని అంచనా వేయడానికి సర్వేలను జరుపుతారు.
Also read:
కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలను రాబడుతూ ఉంటారు తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో అధికార పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వారీగా సర్వే చేసారు. అధికార పార్టీ బిఆర్ఎస్ 45 – 51 , కాంగ్రెస్ 61 -67 , AIMIM 6 – 8 , బిజెపి 2 -3 , ఇతరులు 0 – 1 రావొచ్చని తెలుస్తోంది. అలాగే ఓటింగ్ శాతం బిఆర్ఎస్ 39% – 42 %, కాంగ్రెస్ 41% -44% , AIMIM 3% – 4 %, బిజెపి 10 % – 12 %, ఇతరులు 3 % – 5 % . బీఆర్ఎస్కు 45-51 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 61-67 సీట్లు వస్తాయట ఒకవేళ కనుక సర్వేలో వచ్చిన విషయం నిజమైతే అధికార పార్టీకి గట్టి షాక్ అయితే తప్పదు.