Telugu News » బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ వంటి ప్రాంతాల పేర్లు ఇలా వచ్చాయా..?

బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ వంటి ప్రాంతాల పేర్లు ఇలా వచ్చాయా..?

by Sravya
HYDERBAD

హైదరాబాద్ మహానగరాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. పైగా హైదరాబాద్ చాలా పెద్ద నగరం. ఇక్కడ చాలా ప్రాంతాలు కూడా ఉంటాయి. సికింద్రాబాద్, నాంపల్లి ఇలా ఎన్నో ప్రాంతాలు హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే, చాలామందికి అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టారా అన్న సందేహం ఉంటుంది ఈ పేర్లు వెనుక ఉన్న అర్ధాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇవి కనుక మీరు చూసారంటే ఓహో ఇందుకా ఈ పేరు వచ్చింది అని ఆశ్చర్యపోతారు. శంషాబాద్ గురించి చూసేస్తే.. షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు శంషాబాద్‌గా మారిపోయింది.

అంతర్జాతీయ విమానాశ్రయం వలన బాగా ఫేమస్ అయింది. షమ్స్ అంటే సూర్యుడు. ప్రభువులలో సూర్యుడు లాంటి వాడని దీనికి అర్ధం. ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్‌కి ఉండేది. కులీ కుతుబ్ షా VI భార్య హయత్ బక్షి బేగంని మా సాహెబా తో పిలిచేవారు. మల్లేపల్లి గ్రామంలోని ఓ ట్యాంక్ కట్టారు. మా సాహెబా కా తలాబ్ అని మొదట్లో అనేవారు. అదే మాసబ్ ట్యాంక్ కింద మారింది. బషీర్ బాగ్ ప్యాలెస్ ని అప్పట్లో కట్టారు. అక్కడ ఓ తోట కూడా ఉండేది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూల్చేసింది. కానీ, బహీర్‌బాగ్ పేరు ఉండిపోయింది.

Also read:

నిజాం కూతురు బషీరున్నీసా బేగం పెళ్లి చేసాక కట్నం కింద ఈ ప్రాంతంలో చాలా భూములు ఇచ్చేసారు. ఆ గ్రామం బేగం పేట. ఇలా ఈ పేరు వచ్చిందట. మూడవ నిజాం పేరు సికిందర్ ఝా. బ్రిటీష్ సైన్యం ఇక్కడుండేది. మొదట్లో లక్ష్సర్ అని ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. బ్రిటీష్ సైన్యం కోసం రెసిడెన్సీ బజార్‌ని కట్టారు. ఆ తరవాత సుల్తాన్ బజార్‌గా పేరు మార్చారు. హైదరాబాద్ కి దివాన్‌గా పనిచేసిన రజా అలీఖాన్ బిరుదు ‘నేఖ్ నామ్ ఖాన్. నేఖ్-నాంపల్లి అని మొదట్లో అనేవాళ్ళు. అది ఇప్పుడు నాంపల్లి అయింది. సోనాజీ అనే రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఉద్యోగికికి ఈ ప్రాంతంలో భూములు బాగా ఉండేవట. సోనాజీ కాస్త సోమాజీ అయ్యి, సోమాజీగూడ అయింది.

 

 

You may also like

Leave a Comment