Telugu News » Swift 2024 : మార్కెట్లోకి ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ కారు.. ఎప్పుడంటే..?

Swift 2024 : మార్కెట్లోకి ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ కారు.. ఎప్పుడంటే..?

లేటెస్ట్ ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్ కారును.. టోక్యో మోటార్ (Tokyo Motor)​ షోలో అధికారికంగా ప్రదర్శించింది. వచ్చే ఏడాది దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉందని సుజుకీ మోటార్ కార్పొరేషన్ వారు ప్రకటించారు..

by Venu

ప్రతి మనిషి ఏదో ఒకదాన్ని ఇష్ట పడటం కామన్.. మరికొందరికి కార్లు అంటే ఓ ఫ్యాషన్.. ధనవంతులైతే వారికి నచ్చిన కారు కొని తెచ్చుకుంటారు. ఇలా మనుషుల అభిరుచులకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీతో దూసుకు వస్తున్నాయి. ఇలా వచ్చేదే ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ కారు.. ఇక ఇండియాలో హ్యచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌కి ఉన్న క్రేజ్ మరే కారుకు లేదు.

 

ఇప్పటికే మారుతి సుజుకి (Maruti Suzuki ) స్విఫ్ట్​ (Swift)కార్లు మంచి పని తీరుతో, సూపర్​ మైలేజీతో వినియోగదారుల మనస్సులను కొల్లగొట్టాయి. అంతే కాదు ఈ మోడల్​ కార్లకు భారత్​లో మంచి డిమాండ్​ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకే మారుతి సుజుకి.. తమ లేటెస్ట్ ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్ కారును.. టోక్యో మోటార్ (Tokyo Motor)​ షోలో అధికారికంగా ప్రదర్శించింది. వచ్చే ఏడాది దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉందని సుజుకీ మోటార్ కార్పొరేషన్ వారు ప్రకటించారు..

మరోవైపు ఇండియాలో స్విఫ్ట్ కారుకు స్థిరమైన విక్రయాలు ఉన్నాయి. 2024 అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు 1,03,500 కార్లను విక్రయించింది. బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను కూడా బిజినెస్ లో స్విఫ్ట్ అధిగమించింది. ఇక ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్ కారు పాత మోడళ్ల కంటే మంచి లుక్​తో, స్టైలిష్ డిజైన్​తో రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారులో కొత్తగా బ్లాక్​-కలర్డ్​ గ్రిల్స్​, స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాప్స్​, ఎల్​-షేప్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, పియానో బ్లాక్​ ఓవీఆర్​వీ ఉన్నాయి. కారు వెనుక భాగంలో.. టెయిల్​ ల్యాంప్​లతో కూడిన ఇంటిగ్రేటెడ్​ స్పాయిలర్​లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ నయా స్విఫ్ట్ కారు ముందు భాగం దాదాపు పాత మోడల్స్ లానే సిగ్నేచర్​ స్టైలింగ్​లో ఉంది. కానీ ఎడ్జ్​ లుక్స్​, కాస్మోటిక్ ఛేంజస్​ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు ఇంజిన్ విషయానికి వస్తే.. దీనిలో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. దీని ఫ్యూయెల్ ఎకానమీ 35 కి.మీ నుంచి 40 కి.మీ ఉండవచ్చు.

అంతేగాకుండా​ కారు లోపల వైర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల ఫ్లోటింగ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే స్టార్ట్​.. స్టాప్ పుష్​ బటన్​, సరికొత్త ఎయిర్​ కండిషనింగ్​ వెంట్స్​, టోగిల్ కంట్రోల్స్, న్యూ క్లైమేట్ కంట్రోల్​ డిస్​ప్లే, సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారులో వైర్​లెస్​ ఛార్జింగ్​, 360 డిగ్రీ కెమెరాతో సహా పలు అడ్వాన్స్​డ్​ మోడ్రన్ ఫీచర్స్​ కూడా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం స్విఫ్ట్ ధర రూ. 5,99,450 నుంచి రూ. 9,03,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, 2024లో కొత్త స్విఫ్ట్‌ను ప్రవేశంతో ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి కంపెనీ తన ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్ కారుకి సంబంధించిన ఫీచర్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా త్వరలోనే వీటిని వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

You may also like

Leave a Comment