బీసీసీఐ జూన్‌లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup)కు భారత జట్టును ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దూబే, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, సిరాజ్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది.

టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, స్టార్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరినీ పక్కనపెట్టింది. ఐపీఎల్లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఏల్ రాహుల్, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ షమీకి టీ-20 వరల్డ్ జట్టులో చోటు దక్కకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.. తమ అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ (Rishabh Pant) దాదాపు ఏడాదన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. తిరిగి ఈ మెగా టోర్నీ ద్వారా భారత జెర్సీ ధరించనున్నారు. కాగా, జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జూన్ 5న భారత జట్టు తన తొలి మ్యాచులో ఐర్లాండ్‌తో తలపడనుంది.