Telugu News » UdayaNIdhi stalin: ఎటువంటి కేసులకైనా నేను సిద్ధమే: ఉదయనిధి!

UdayaNIdhi stalin: ఎటువంటి కేసులకైనా నేను సిద్ధమే: ఉదయనిధి!

నేను మారణహోమానికి ఆజ్యం పోశానని చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు

by Sai
tamilandu cm mk stalin son udayanidhi stalin defends sanatana dharma remarks

ఆదివారం నాడు తమిళనాడు మంత్రి , నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin)సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని.. కేవలం దానిని వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ఉదయనిధి స్పందించారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎటువంటి కేసులను ఎదుర్కోడానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

tamilandu cm mk stalin son udayanidhi stalin defends sanatana dharma remarks

ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించాను.. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని మళ్లీ చెబుతున్నాను. పదే పదే ఇదే చెబుతాను. నేను మారణహోమానికి ఆజ్యం పోశానని చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు.. మరికొందరు ద్రవిడాన్ని రద్దు చేయాలని అంటున్నారు. అంటే డీఎంకే(DMK) వాళ్లను చంపాలా?’ అని ఉదయనిధి ప్రశ్నించారు.

‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అని ప్రధాని మోడీ(Modi) చెప్పినప్పుడు కాంగ్రెస్‌ (congress) వాళ్లను చంపాలా? సనాతన అంటే ఏమిటి? సనాతన అంటే ఏదీ మారకూడదు.. అన్నీ శాశ్వతం. కానీ ద్రవిడ మోడల్ మార్పు కోసం పిలుపునిస్తుంది.. అందరూ సమానంగా ఉండాలి. నా ప్రకటనను వక్రీకరించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం బీజేపీకి మామూలే’ అని ధ్వజమెత్తారు.

నాపై ఎటువంటి కేసులను పెట్టిన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాను.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ను చూసి బీజేపీ(BJP) భయపడుతోంది.. సమస్యలపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాద్దాంతం చేస్తున్నారు.. దేవుడు ఒక్కడనేది డీఎంకే విధానం.. తాను కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించాను.. నా వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని అన్నారు.

You may also like

Leave a Comment