Telugu News » Tamilnadu : సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండర్.. తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా..!

Tamilnadu : సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండర్.. తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా..!

మరోవైపు 19 ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రం ఎర్నాకులం రైల్వేలో చేరిన ట్రాన్స్‌జెండర్ సింధు.. బదిలీపై తమిళనాడు, దిండిగల్‌కు వచ్చారు. గత 14 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన సింధును రైల్వే వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు.

by Venu
indian-railways-increases-its-compensation-to-10-times

సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.. కొంత కాలం వరకు ట్రాన్స్‌జెండర్ (Trangender) అంటే చిన్న చూపు ఉండేది. కానీ వారు కూడా క్రమక్రమంగా ఉన్నత శిఖరాలకు చేరుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో తొలిసారి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా (First Railway Ticket Inspector) తమిళనాడు (Tamilnadu)కు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు.

indian-railways-increases-its-compensation-to-10-times

నాగర్‌కోవిల్‌కు చెందిన సింధు తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్‌ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకొన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

మరోవైపు 19 ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రం ఎర్నాకులం రైల్వేలో చేరిన ట్రాన్స్‌జెండర్ సింధు.. బదిలీపై తమిళనాడు, దిండిగల్‌కు వచ్చారు. గత 14 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన సింధును రైల్వే వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు.

ఇక ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్లు పోటీ ప్రపంచంలో తమ సత్తా చాటుతున్నారు. హిజ్రాలుగా పేరుగాంచిన వారు కుంగిపోకుండా.. ఏకాగ్రతతో ఉన్నత విద్య అభ్యసించి.. కష్టపడటం ద్వారా.. గొప్ప స్థాయికి చేరుకోవడం ద్వారా.. సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను పొందేందుకు అర్హులవుతారని నిరూపిస్తున్నారు. తాము ఎందులో తక్కువ కాదని చాటుతున్నారు..

You may also like

Leave a Comment