Telugu News » TCS : టీసీఎస్ లో ఇకపై అలా కుదరదు..!

TCS : టీసీఎస్ లో ఇకపై అలా కుదరదు..!

2020లో కోవిడ్ కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశమిచ్చింది.

by Prasanna
tcs

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న హైబ్రిడ్‌ వర్క్ మోడల్ (Hybrid work Model) కు గుడ్ బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి టీసీఎస్ ఎంప్లాయిస్ (Employees) అంతా ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

tcs

టీసీఎస్ నిర్ణయాన్ని ఇతర ఐటీ కంపెనీలు సైతం ఫాలో అయ్యే అవకాశముంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2020లో కోవిడ్ కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశమిచ్చింది. ఆ తర్వాత వారంలో కొన్ని రోజులు ఆఫీసు, కొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది. దీనినే హైబ్రిడ్ వర్క్ మోడల్ అంటున్నారు.

ఈ విధానంలో కంపెనీని బట్టి ఉద్యోగులు వారంలో ఒకటి నుంచి 3 రోజులు ఆఫీసుకు వెళ్లడం మిగతా రోజులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగులు ప్రస్తుతం వారంలో 3 రోజులు మాత్రమే ఆఫీసులు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ వర్క్ కల్చర్కు గుడ్ బై చెప్పిన సంస్థ అక్టోబర్ 1 నుంచి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇకపై ఈ విధానానికి ముగింపు పలుకుతున్నట్లు టీసీఎస్…తన ఉద్యోగులకు తెలిపింది. కొన్ని నెలల నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రాముఖ్యతను కంపెనీ నొక్కిచెబుతూనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక రిపోర్ట్‌లోనూ…ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాల్సిన ఆవశ్యకత గురించి వివరించింది. 2020 మార్చి తర్వాత ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించుకున్న టీసీఎస్.. వారి అవసరం కంపెనీకి ఎలా ఉందో కూడా తెలిపింది.

You may also like

Leave a Comment