మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు ఏపీ (AP) రాజకీయ రూపు రేఖలను పూర్తిగా మార్చేశాయి. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజల్లో తిరగవలసిన టీడీపీ (TDP) ముఖ్యనేత జైల్లో ఉండటం మింగుడు పడని విషయం. ఎప్పుడైతే బాబు అరెస్ట్ జరిగిందో అప్పటి నుండి అధికార పార్టీ వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఊహించని స్థాయికి చేరుకోంది.
ఈ నేపథ్యంలో ఏపీ హేట్స్ జగన్ (AP Hates Jagan) పేరుతో టీడీపీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఏపీ హేట్స్ జగన్ హ్యాష్ ట్యాగ్ తో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే వైసీపీ, విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో వై ఏపీ నీడ్స్ జగన్ (Y AP Needs Jagan) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించగా.. ఏపీ నీడ్స్ జగన్ కాదు. ఏపీ హేట్స్ జగన్ అంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
ఏపీని సర్వ నాశనం చేసిన జగన్ మరో సారి అధికారం చేపడితే అసలు ఏపీనే ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల పై కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక ఏపీలో ఇప్పుడు జరుగుతోన్న రాజకీయ సంఘర్షణను గమనిస్తున్న వైసీపీ అభిమానులు ఒకప్పుడు బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ కుటుంబాన్ని విధిపాలు చేసిన ఘటన టీడీపీ నేతలకు ఎందుకు గుర్తుకు రావడం లేదో అని ప్రశ్నిస్తున్నారు. బాబుకు ఒక న్యాయమా.. జగన్ కు ఒక న్యాయమా అంటూ ఎదురు విమర్శలకు దిగారు.