ఏపీ (AP)లో ప్రధానంగా టీడీపీ (TDP), వైసీపీ (YCP)మధ్య భీకర పోరు నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కాపాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పోరులో టీడీపీకి జనసేన (Janasena) తోడైంది. ముఖ్యమంత్రి జగన్ (Jagan) లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. మరోవైపు చంద్రబాబు (Chandr Babu) అరెస్ట్ సమయంలో సొంత పార్టీ నేతల కంటే జనసేనాని అండగా నిలిచారు.
చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ మాటలు టీడీపీ నేతలకు టానిక్ లా పనిచేశాయి. ఇక ఈ రోజు జైల్లో ఉన్న చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రహ్మణీ, మంతెన సత్యనారాయణ రాజు ములాకాత్ అయ్యారు. సుమారుగా 40 నిమిషాల పాటు బాబుతో చర్చలు జరిపారు. అనంతరం జైలు బయట ఉన్న టీడీపీ నేతలతో లోకేశ్ ముచ్చటించారు..
ములాకాత్ లో చర్చించిన విషయాలను పార్టీ శ్రేణులకు లోకేశ్ వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని, పార్టీ నేతలను, కార్యకర్తలను ధైర్యంగా ఉండమని చెప్పినట్టు తెలిపారు. బాబు ఎప్పుడు బయటికి వస్తారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చినరాజప్ప అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే సమయానికి టీడీపీ, జనసేన పార్టీలు కలిసి జనంలోకి వెళ్తారని, గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ దేశం రావణాసుర దహనం చేసి అసురుడిని కాల్చేస్తోందని.. మనం జగనాసుర దహనం చేసి ఏపీకి పట్టిన పీడను వదిలిద్దాం అంటూ పిలుపునిచ్చారు.. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సైకో పాలనకు చరమ గీతం పాడుదామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు..
- మరిన్ని తెలుగు రాజకీయ వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇవి చదవండి