Telugu News » TDP-Janasena: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌పై నేతల అసంతృప్తి..!!

TDP-Janasena: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌పై నేతల అసంతృప్తి..!!

టీడీపీ–జనసేన(TDP-Janasena) ఫస్ట్ లిస్ట్‌(First List)పై సొంత పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్, మండలి బుద్ధ ప్రసాద్(Buddha Prasad) ఫేస్ బుక్‌లో నైరాశ్యం వ్యక్తం చేశారు.

by Mano
TDP-Janasena: Discontent of leaders on TDP-Janasena first list..!!

టీడీపీ-జనసేన(TDP-Janasena) ఫస్ట్ లిస్ట్‌(First List)పై సొంత పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో 24 సీట్లు జనసేన నేతలకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు తక్కువ సీట్లు కేటాయించారనే భావన జనసైనికుల్లోనూ మెదులుతోంది. దీంతో ఇరు వర్గాల నేతలు అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.

TDP-Janasena: Discontent of leaders on TDP-Janasena first list..!!

కొందరు పార్టీలకు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్ కార్యచరణకోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అవనిగడ్డ సీటు పెండింగ్‌లో పెట్టడంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్, మండలి బుద్ధ ప్రసాద్(Buddha Prasad) ఫేస్ బుక్‌లో నైరాశ్యం వ్యక్తం చేశారు.

రాజకీయ పక్షాలు ఓటరును కేవలం కొనుగోలు వస్తువుగా భావిస్తున్నాయని, ధనవంతుల కోసం అన్వేషిస్తున్నారని అన్నారు. తనలాంటి వ్యక్తి ఎన్నికల్లో నిలబడాలనుకోవడం సమంజసం కాదనిపిస్తోందన్నారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ స్పందిస్తూ ఫస్ట్ లిస్టులో తన పేరు లేకపోవడంతో మహదానందంగా ఉందంటూ పేర్కొన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్ఛగా పొందినట్లు ఉందని, కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండని హితవుపలికారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. పదవులు వచ్చినప్పుడు ప్రాంత అభివృద్ధికి పనిచేశా. అంతేకానీ దోచుకోలేదు. రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడంతా డబ్బు రాజకీయాలదే ప్రధానం అయింది.’ అంటూ బుద్ధ ప్రసాద్ రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment