Telugu News » TDP: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..!!

TDP: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు.. 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు..!!

144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ(TDP) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) నిర్ణయించినట్లు తెలుస్తోంది.

by Mano
TDP: Key turning point in AP politics.. Change of candidates in 5 seats..!!

ఎన్నికల వేళ ఏపీ(AP) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ(TDP) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్ల సమీకరణల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

TDP: Key turning point in AP politics.. Change of candidates in 5 seats..!!

మార్పుల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. అన్నెపర్తి టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బీఫారంను పెండింగ్‌లో పెట్టారు. బీఫారంను తీసుకునేందుకు రావద్దని చింతమనేనికి టీడీపీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక, అన్నెపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నట్లు సమాచారం. వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మిసాయిప్రియకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్ పోటీ  చేస్తుండటంతో లక్ష్మిసాయిప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది.

ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీ కండువా కప్పుకున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీనిలో భాగంగా రామరాజు స్థానంలో రఘురామకు ఉండి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫామ్ అందజేయనున్నారు.

అదేవిధంగా అలాగే పాడేరు టికెట్లను కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ శ్రేణులు ఆయనను మార్చాలని పట్టుబడుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అదేవిధంగా మడకశిర నుంచి సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించగా ఆ స్థానంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వాలని  నిర్ణయించినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment