Telugu News » TDP : టీడీపీకి షాక్ ఇచ్చిన పోలీసులు.. కీలక నేత అరెస్ట్..!

TDP : టీడీపీకి షాక్ ఇచ్చిన పోలీసులు.. కీలక నేత అరెస్ట్..!

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి బీటెక్ రవికి (B tech Ravi) 14 రోజుల రిమాండ్ విధించింది కడప జిల్లా కోర్టు.. కడప విమానాశ్రయం వద్ద జరిగిన ఘర్షణ, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

by Venu

ఏపీ (AP)లో అరెస్ట్ ల పర్వం కొనసాగడం పై టీడీపీ (TDP) నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ (YCP) కుట్రలో భాగంగా ఈ అరెస్ట్ లు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. చేయని నేరానికి చంద్రబాబుని (Chandrababu) వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆరోపించిన టీడీపీ శ్రేణులు.. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని, నేడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రచ్చ ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి బీటెక్ రవికి (B tech Ravi) 14 రోజుల రిమాండ్ విధించింది కడప జిల్లా కోర్టు.. కడప విమానాశ్రయం వద్ద జరిగిన ఘర్షణ, టికెట్ బెట్టింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా..14 రోజుల రిమాండ్ విధించారు. ఇవాళ కడప కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

మరోవైపు పోలీసుల తీరుపై జిల్లా కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.10 నెలల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? ఇన్ని రోజులు ఏం చేశారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు. దాంతో.. రవిపై బెట్టింగ్ కేసులో 41 ఏ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు పోలీసులు.

పులివెందులలో జరిగిన యువగళం పాదయాత్ర సందర్భంగా జనవరి 25న నారా లోకేశ్ కు ఆహ్వానం పలికేందుకు బీటెక్ రవి కడప విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, రవి అనుచరులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పిన పోలీసులతో బీటెక్ రవి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment