ఏపీ(AP)లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. వైసీపీ నేత ఎమ్మెల్సీ అరుణ్ కుమార్(Arun Kumar) ప్రచార సమయంలో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై కర్రలతో దాడికి దిగారు. దీంతో వైసీపీ నేతలు వారిపై రాళ్లు రువ్వారు.
వైసీపీ కార్యకర్తలు మూడు రాజధానులపై ప్రచారం చేయడంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మూడు రాజధానులు ప్రకటించి అమరావతిని నాశనం చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు పలువురికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని కూటమి అభ్యర్థి సౌమ్య పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దాడి విషయమై ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.