2023లో అన్ని ఫార్మాట్లో టీమ్ఇండియా(Team India) అద్భుతంగా ఆడింది. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఎన్ని విజయాలు సాధించినా డబ్ల్యూటీసీ(WTC), వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్(ODI Final)లో ఓటమి క్రికెట్ ఫ్యాన్స్‌ను కలచివేసింది. దీంతో ఐసీసీ(ICC) ట్రోఫీ నిరీక్షణ 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అయితే 2024లో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.
ఈ టోర్నమెంట్‌లోనైనా రాణించి టైటిల్ పట్టేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. మరి ఈ ఏడాది టీమ్ఇండియా పర్యటనలు ఏంటి? ఏయే దేశాలతో ఏయే ఫార్మాట్ క్రికెట్ ఆడనుంది? ఎప్పుడెప్పుడు ఆ మ్యాచ్‌లు జరగనున్నాయో చూస్తే.. జనవరి 3 నుంచి 7 వరకు సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్. స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ 20సిరీస్ జనవరి 11 నుంచి 17 వరకు, భారత్-ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌ల టెస్టు జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరగనున్నాయి.
మార్చి-మే మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉండనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా జూన్ 4 నుంచి 30 వరకు టోర్నీ జరగనుంది. అదేవిధంగా భారత్.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆ మ్యాచ్ ముగిశాక సెప్టెంబర్‌లో టీమ్ఇండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొననుంది.
రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల జరగనున్నాయి. భారత్- న్యూజిలాండ్ మధ్య స్వదేశంలో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఉండనుంది. ఏడాది చివరలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ దాదాపు 2024 నవంబర్ – 2025 జనవరి మధ్యలోనే ఉండనుంది.
టీమ్ఇండియా 2023లో అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. 35 వన్డేల్లో 27మ్యాచ్‌లు, 23 టీ20ల్లో 15మ్యాచ్‌ల్లో సత్తాచాటింది. అదేవిధంగా ఎనిమిది టెస్టు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు నెగ్గింది. మూడు మ్యాచుల్లో టీమిండియాకు నిరాశ ఎదురైంది. మరో రెండు మ్యాచులు డ్రా అయ్యాయి.