Telugu News » KCR : కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..!

KCR : కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..!

హెలిక్యాప్టర్‌ లో సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. సీఎం టూర్ కొనసాగేలా ఏవియేషన్‌ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

by admin
technical-issue-in-cm-kcrs-helicopter

తెలంగాణ (Tekangana) సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా రోజుకి 2, 3 సభలు కవర్ చేసిన ఆయన.. సోమవారం నుంచి 4 సభలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో జరిగే సభలకు హాజరయ్యేందుకు హెలికాప్టర్‌ లో బయలుదేరారు. అయితే.. ఆ హెలికాప్టర్‌ లో సాంకేతిక సమస్య తలెత్తింది.

technical-issue-in-cm-kcrs-helicopter

సమస్యను ముందుగానే పసిగట్టిన పైలట్.. వెంటనే అప్రమత్తమై మార్గమధ్యం నుండి తిరిగి ఆయన వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్‌ ను మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఏవియేషన్​ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్​ ను ఏర్పాటు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ సోమవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. హెలిక్యాప్టర్‌ లో సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. సీఎం టూర్ కొనసాగేలా ఏవియేషన్‌ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

You may also like

Leave a Comment