Telugu News » Tenth Class Exams : విద్యార్థులకు అలర్ట్…. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల….!

Tenth Class Exams : విద్యార్థులకు అలర్ట్…. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల….!

మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది.

by Ramu
telangana 10th class exam schedule release from march 18 to april 2

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల (Tenth Class Exams) షెడ్యూల్ (Schedule) విడుదలైంది. ఎస్ఎస్‌సీ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ తాజాగా రిలీజ్ చేసింది. మార్చి 18వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది.

telangana 10th class exam schedule release from march 18 to april 2

ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. మార్చి 18 సోమవారం మొదటి లాంగ్వేజ్ పరీక్ష, మార్చి 19న మంగళవారం సెకండ్​ లాంగ్వేజ్​, మార్చి 21 గురువారం ధర్డ్​ లాంగ్వేజ్​(ఇంగ్లీష్​) పరీక్షలు ఉంటాయని తెలిపింది. మార్చి 23 శనివారం మేథమేటిక్స్​ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం… మార్చి 26 మంగళవారం సైన్సు(పార్టు:1 ఫిజికల్​ సైన్సు)ను, మార్చి 28 గురువారం సైన్సు( పార్టు:2 బయోలాజికల్​ సైన్సు) ఉదయం 9:30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు జరుగుతుంది. మార్చి 30 శనివారం సోషల్​ స్టడీస్​ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది.

ఏప్రిల్ 1 సోమవారం ఓఎస్​ఎస్​సీ మెయిన్ లాంగ్వేజ్​ పేపర్​-1(సంస్కృతం లేదా అరబిక్​) ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, ఏప్రిల్ 1 సోమవారం ఎస్​ఎస్​సీ ఓకేషనల్ కోర్సు థియరీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు, ఏప్రిల్ 2 మంగళవారం ఓఎస్​ఎస్​సీ లాంగ్వేజ్​ పేపర్ 2 సంస్కృతం లేదా అరబిక్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందని పేర్కొంది.

You may also like

Leave a Comment