Telugu News » Telangana: హైకోర్టు జడ్జికి 23మంది పిల్లల ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..!

Telangana: హైకోర్టు జడ్జికి 23మంది పిల్లల ఫిర్యాదు.. ఎందుకో తెలుసా..!

పార్క్‌లో ఉన్న కొంత స్థలాన్ని కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నం చేస్తున్నారని చిన్నారులు లేఖలో పేర్కొన్నారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతోందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 23మంది చిన్నారులు లేఖలో పేర్కొన్నారు.

by Mano
Telangana: 23 children complain to the High Court judge.. Do you know why..!

ఇప్పటి వరకు పిల్లలు పోలీస్‌స్టేషన్‌ వెళ్లి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిన ఘటనలు చూసే ఉంటాం. అయితే తాజాగా అలాంటి ఘటనే జరిగింది. అయితే, ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23మంది పిల్లలు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు (Chief Justice of Telangana High Court) లేఖ రాశారు.

Telangana: 23 children complain to the High Court judge.. Do you know why..!

ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది. స్థానికంగా ఉన్న చిన్నారులు ఆడుకునేందుకు ఈ పార్క్‌కు వస్తుంటారు.

అయితే పార్క్‌లో ఉన్న కొంత స్థలాన్ని కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నం చేస్తున్నారని చిన్నారులు లేఖలో పేర్కొన్నారు. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతోందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖలో పేర్కొన్నారు.

మొత్తం 23మంది చిన్నారులు లేఖను రాయగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు  స్వీకరించింది. కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్‌కు పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 7కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

You may also like

Leave a Comment