లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ (Congress) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల ఇంఛార్జ్ లను మార్చింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్ రావు ఠాక్రే (Manikrao Thakare)ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షీని హైకమాండ్ నియమించింది. బెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ భార్య దీపాదాస్ మున్షీ. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు ఠాక్రేకు గోవా-డయ్యూ డామన్ వ్యవహారాల ఇన్ చార్జీగా బాధ్యతలను హైకమాండ్ అప్పగిచించింది.
మరోవైపు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా మాణికం ఠాగూర్‌ను నియమించింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా అదనపు బాధ్యతలను అప్పగించింది. కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్ గా రణదీప్ సింగ్, తమిళనాడు-పుదుచ్చేరి-ఒడిశా ఇన్చార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది ఇలా వుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇంచార్జీగా ఏఐసీసీ నియమించింది. అంతకు ముందు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీగా పనిచేస్తున్న మాణిక్ రావ్ ఠాకూర్ అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఫిర్యాదు చేశారు.