Telugu News » Revanth Reddy : ఆ ఎమ్మెల్యే కు ఇసుక దందా కమిషన్ల ధ్యాస తప్ప వేరే లేదు..!!

Revanth Reddy : ఆ ఎమ్మెల్యే కు ఇసుక దందా కమిషన్ల ధ్యాస తప్ప వేరే లేదు..!!

రేవంత్ వ్యవహారం చూస్తుంటే ఇంట గెలిచిన తర్వాతనే రచ్చ గెలవాలి అనే సామెతను అమల్లోకి తెస్తున్నట్టు కనిపిస్తుందని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ అన్ని నియోజకవర్గాల్లో గెలవడం కన్నా ఇప్పుడు కొడంగల్ (Kodangal) కామారెడ్డి (Kamareddy)లో గెలవడమే ముఖ్యంగా మారింది.

by Venu

తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో రేవంత్​రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పటాకులా పేలుతున్న మాటలతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ కొడంగల్​లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. హస్తంకు అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న రేవంత్ తన సొంత నియోజకవర్గం ప్రచారంలో పాల్గొని బీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించారు..

tpcc-revanth-reddy-strong-counter-to-minister-ktr

రేవంత్ వ్యవహారం చూస్తుంటే ఇంట గెలిచిన తర్వాతనే రచ్చ గెలవాలి అనే సామెతను అమల్లోకి తెస్తున్నట్టు కనిపిస్తుందని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ అన్ని నియోజకవర్గాల్లో గెలవడం కన్నా ఇప్పుడు కొడంగల్ (Kodangal) కామారెడ్డి (Kamareddy)లో గెలవడమే ముఖ్యంగా మారింది. ఇందులో భాగంగా దౌల్తాబాద్​, మద్దూర్​లో రోడ్​షో నిర్వహించారు. బీఆర్​ఎస్ (BRS)పై విమర్శల అస్త్రాలు ఎక్కుపెట్టారు.

బీఆర్​ఎస్ గత ఐదేళ్లలో ​చేసిన అభివృద్ధి శూన్యమేనని ఆరోపించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొడంగల్​ ఈ మాత్రం ఉందంటే కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. ఇంత కాలం మాయ మాటలతో బీఆర్​ఎస్ నాయకులు గాల్లో మేడలు కట్టారని.. కొడంగల్ లో వారు చేసిన అభివృద్థి చూపించండంటూ సవాల్ విసిరారు.

ఇక్కడి ఎమ్మెల్యే కు ఇసుక దందా, ట్రాక్టర్లపై కమిషన్ల ధ్యాస తప్ప అభివృద్థి అంటే తెలియదని విమర్శించారు. కాంగ్రెస్​ హయాంలో నారాయణపేట- కొడంగల్​ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోస్తే నిర్మించకుండా వదిలేశారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

You may also like

Leave a Comment