తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమలం జోరు పెంచుతుంది. జనసేన, బీజేపీ (BJP) పొత్తు ఖరారైన తర్వాత జనసేన అధ్యక్షుడు ప్రచారంలో పాల్గొనే విషయంలో క్లారిటీ ఇచ్చిన కాషాయం.. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరఫున వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూరు (Tandoor) నియోజకవర్గంలో నిర్వహించే భారీ సభలో జనసేన పాల్గొంటున్నట్టు తెలిపింది.
మరోవైపు బీజేపీ వరంగల్ (Warangal)లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో దూకుడు తగ్గించింది అనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.. రాష్ట్రంలో వరుసగా సభలతో హోరెత్తించడానికి సిద్దం అయిన కమలం.. తెలంగాణలో మంగళవారం నిర్మలాసీతారామన్, ఫడ్నవీస్, పీయుష్ గోయల్ ప్రచారం నిర్వహించనున్నారు.
నిర్మలా సీతారామన్, జూబ్లీహిల్స్‌లో.. దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్‌లో ప్రచారానికి సిద్దం అయ్యారు. మరోవైపు 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 25, 26న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, హుజూరాబాద్, మహేశ్వరం సభలకు హాజరవుతున్నారు.. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 22న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు.. 26న అమిత్‌షాతో కలిసి హైదరాబాద్‌లో జనసేన ప్రచారం నిర్వహించే విధంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు..
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ప్రచారం పార్టీకి కలిసివస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో అగ్రనేతల షెడ్యూల్ చూస్తే.. 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి పర్యటన.. 25, 26న స్మృతి ఇరానీ పర్యటన.. 22న వరంగల్ బహిరంగ సభకు పవన్.. 26న అమిత్‌షాతో కలిసి పవన్ ప్రచారం.. 25, 26, 27 తేదీల్లో మోదీ ప్రచారం నిర్వహించడానికి కమలం సిద్దం అయ్యింది.