ఎన్నికల సమయంలో కార్యకర్తలు నేతలు అనే తేడా లేకుండా అందరూ గరం గరంగా ఉంటున్నారు. ఇక నేతలు అయితే మాటల్లో.. సెన్సార్ లేని సినిమాల్లోని సీన్స్ లా రెచ్చిపోవడం కనిపిస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలో విమర్శలు యుద్ధాన్ని తలపిస్తున్నాయని జనం భావిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి (Peddapalli) కాంగ్రెస్ (Congress) అభ్యర్థి చింతకుంట విజయ రమణారావుపై (Chintakunta Vijaya Ramana Rao) మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ ( Former MLA Gone Prakash Rao) సంచలన ఆరోపణలు చేశారు.
చింతకుంట విజయ రమణారావు ఆస్తులు, పాన్ కార్డులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని గోనె ప్రకాష్ ఆరోపించారు. హైదరాబాద్‌లో రెంట్ వచ్చే అపార్ట్‌మెంట్లతో పాటు, హాంగ్ కాంగ్‌లో కూడా ఆస్తులు ఉన్నాయని గోనె ప్రకాష్ వెల్లడించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఈడీ, ఆదాయపన్ను శాఖ, హోమ్ శాఖ, ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విజయ రమణారావుకు ఓటు వేస్తే పెద్దపల్లి ప్రజల ఓటు వృధా అవుతుందని.. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు, చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు గోనె ప్రకాష్.. మరోవైపు విజయ రమణారావుకు వ్యతిరేకంగా ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసే అవసరం నాకు లేదని ఆరోపిస్తూ.. నన్ను మోసం చేసాడు, ఇబ్బంది పెట్టాడు కాబట్టి దర్యాప్తు సంస్థలకి రమణా రావుపై ఫిర్యాదు చేస్తున్నానని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.