తెలంగాణ(Telangana) అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ(శనివారం) ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంతో సభను ప్రారంభమైంది. అనంతరం తెలంగాణలో హుక్కా పార్లర్ల(hookah parlors)పై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి తరఫున మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridharbabu) సభలో మాట్లాడారు.
ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా అసెంబ్లీ ఈ బిల్లుకు దీనికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. విషయాన్ని సభాపతి ప్రసాద్కుమార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సిగరెట్ కంటే హుక్కా పొగ మరింత హానికరమైనదని తెలిపారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని చెప్పారు. దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని వెల్లడించారు. అందుకే హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం రేవంత్రెడ్డి భావించారని తెలిపారు.
యువతను అవకాశంగా తీసుకుని హుక్కా నిర్వాహకులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని మండలి సభ్యులను ఆయన కోరారు. దీనిపై మండలిలో చర్చ కొనసాగింది. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి స్పందించారు. హుక్కా చాలా ప్రమాదకరమని, దీనికి యువత బానిసలు అవుతున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల విక్రయదారులపై కఠిన శిక్షలు ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో గుట్కాపై నిషేధం విధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మరో వైపు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం బాగా పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా గంజాయి విస్తరించిందని చెప్పారు. ఇది చాలా మంచి బిల్లు అని ఆమె అన్నారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిసారించాలని ఆయన సూచించారు.