Telugu News » Telangana: బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన..!

Telangana: బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన..!

మాజీ ఎమ్మెల్యే(Ex MLA) తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలో కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపుతానని వెల్లడించారు.

by Mano
Telangana: Big shock for BRS.. Former MLA's resignation announcement..!

వరంగల్(Warangal) ఎంపీ సీటుపై బీఆర్ఎస్ స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే(Ex MLA) తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలో కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపుతానని వెల్లడించారు.

Telangana: Big shock for BRS.. Former MLA's resignation announcement..!

ఇంతకాలం పార్టీ విధేయుడిగా ఉన్నానన్న రాజయ్య తగిన గుర్తింపు లేకపోవడం, పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ఈనెల 10వ తేదీన హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను రాజయ్య లైంగికంగా వేధించాడంటూ జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవ్యతో రాజయ్య సయోధ్య కుదుర్చుకోగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ తనను కాదని కడియం శ్రీహరికి ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ బుజ్జగింపుల పర్వం కొనసాగించింది. అదే సమయంలో రాజయ్య కాంగ్రెస్ నేతలతో పలు మార్లు భేటీ అయ్యారు. అప్పటి నుంచి పార్టీ రాజయ్యను దూరం పెడుతూ వచ్చింది. దీంతో రాజయ్య తాజాగా రాజీనామా ప్రకటన చేశారు.

You may also like

Leave a Comment