Telugu News » BJP : యుద్ధం మొదలుపెట్టిన బీజేపీ.. 14 కమిటీలకు చైర్మన్ల ప్రకటన

BJP : యుద్ధం మొదలుపెట్టిన బీజేపీ.. 14 కమిటీలకు చైర్మన్ల ప్రకటన

అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఎన్నికల కోసం ఈ 14 కమిటీల చైర్మన్లను ప్రకటించింది.

by admin
BJP Maha Dharna On double bedroom issue

– మోడీ టూర్ తర్వాత బీజేపీ దూకుడు
– ఓవైపు ఎన్నికల వ్యూహాలు
– ఇంకోవైపు సమావేశాల జోరు
– రాష్ట్రానికి జేపీ నడ్డా రాక
– కొత్త కమిటీల ప్రకటనతో జోష్

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ (BJP) ముందుకు సాగుతోంది. సమావేశాలు, సభలు, వ్యూహ రచనల్లో తలమునకలైంది. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన బీజేపీ (BJP) కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, ముఖ్యనేతలు, జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్‌లు ఇందులో పాల్గొన్నారు. జిల్లా, ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది.

bjp flag

శుక్రవారం స్టేట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణ పర్యటన పెట్టుకున్నారు. ఘట్ కేసర్‌ లో జరిగే స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌ లో నడ్డా పాల్గొననున్నారు. తెలంగాణ బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో ఎన్నికల కమిటీలను ప్రకటించింది బీజేపీ. మొత్తం 14 ఎన్నికల కమిటీలను అనౌన్స్ చేసింది. ప్రధాని మోడీతో ఒకేవారంలో రెండు సభలు నిర్వహించి జోరు మీదున్న కమలదళం.. ఎన్నికల వరకూ ఇదే జోరును కొనసాగించాలని భావించి సమావేశాలు, సభలు, కమిటీల పేరుతో హడావుడి చేస్తోంది.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా వివేక్ వెంకటస్వామి, సోషల్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్ గా కోవ లక్ష్మణ్, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్‌ గా బండి సంజయ్, ఇన్ ఫ్లూవెన్సర్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్‌ గా డీకే అరుణ, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌ గా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, పోరాటాల కమిటీ చైర్మన్‌ గా విజయశాంతి, సోషల్ మీడియా చైర్మన్‌ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ చైర్మన్‌ గా మర్రి శశిధర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌ గా ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్‌ గా రఘునందన్ రావు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌ గా వదిరె శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్‌ గా జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్‌ గా గరికపాటి మోహన్ రావును నియమించింది బీజేపీ. అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఎన్నికల కోసం ఈ 14 కమిటీల చైర్మన్లను ప్రకటించింది.

పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తూ తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. మహబూబ్‌నగర్‌ సభలో మోడీ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డుతో పాటు ములుగులో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా పంచాయితీకి కూడా తెర దించే ప్రయత్నం చేస్తోంది. వివాదం పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు ఆపార్టీ నేతలు. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు.

You may also like

Leave a Comment