తెలంగాణలో షెడ్యూల ప్రకారమే ఎన్నికలు (Elections) నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ( Vikas Raj) వెల్లడించారు. ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే ఉందన్నారు. ఈ సారి 15 లక్షల మంది ఓటర్లు (Voters) కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్నారు. 6.99 లక్షల మంది యంగ్ ఓటర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు.
మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. బీఆర్ఎకే భవన్ లో మీడియా సెంటర్ ను వికాస్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ……ఎలక్ట్రానిన్ ఓటింగ్ మిషన్స్ పై జిల్లాలోని అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర – రాష్ట్ర పరిధిలో మొత్తం 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని వివరించారు.
పలు సమస్యలపై చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎన్నికల కోసం ఇప్పటికే నాలుగు వేల భవనాలను గుర్తించామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై చర్యలు ఉంటాయని తెలిపారు.